VZM: విద్యార్థులు క్రమశిక్షణ తప్పడంతో పెంట ఉన్నత పాఠశాల హెచ్ఎం చింతా రమణ గుంజీలు తీసిన సంగతి తెలిసిందే. ఈ వీడియో రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయింది. ఈ నేపథ్యంలో బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయన మాస్టారును తన కోటకు రప్పించుకుని అభినందనలు తెలిపారు. అనంతరం దుస్సాలువతో ఘనంగా సత్కరించి ఆయన వినూత్న ఆలోచనను అభినందించారు.