ప్రకాశం: అద్దంకిలోని మండల పరిషత్ కార్యాలయం నందు ఎండిఓ సింగయ్య శుక్రవారం హౌసింగ్ మరియు ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గృహ నిర్మాణం లబ్ధిదారులు ఎస్సీ, బీసీలు అయితే ప్రభుత్వం 50 వేల నుండి 75 వేల వరకు అదనపు సహాయం అందిస్తుందని అన్నారు. పొదుపు సంఘాల ద్వారా ఒక లక్ష వరకు వడ్డీ లేని రుణం కూడా మంజూరు చేపడుతుందని సింగయ్య తెలిపారు.