సత్యసాయి: పెనుకొండ మండలంలోని అంబేద్కర్ సర్కిల్లో ‘స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హిందూపురం ఎంపీ బీకే.పార్థసారథి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ రోడ్లపై చెత్తను ఊడ్చారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. మన పరిసరాలను మనమే శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. రోడ్డుపైన అనవసరంగా చెత్త వేసి మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకోవడం మంచిది కాదన్నారు.