ATP: రామగిరి మండల కేంద్రంలో ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివాస్’ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చీపురు పట్టి రోడ్లు ఊడ్చారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. దేశంలోనే అత్యంత పరిశుభ్ర రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనే లక్ష్యంగా టీడీపీ ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు.