NRML: జిల్లా పాఠశాల క్రీడాసమాఖ్య ఆధ్వర్యంలో డిసెంబర్ 8 సోమవారం ఎన్టీఆర్ మినీ స్టేడియంలో U-14,U-17 బాల, బాలికల బేస్బాల్ జిల్లా జట్ల ఎంపికలు నిర్వహించనున్నారు. పాల్గొనే విద్యార్థులు బోనఫైడ్, జనన సర్టిఫికేట్, గత సంవత్సరం ప్రోగ్రెస్ కార్డ్, ఆధార్ జిరాక్స్ కాపీలతో ఉదయం 8 గంటలకు రిపోర్ట్ చేయాలని డిఇఓ భోజన్న శనివారం ప్రకటనలో తెలిపారు.