విమాన టికెట్ ధరలు అడ్డగోలుగా పెంచడంపై కేంద్ర విమానయాన శాఖ స్పందించింది. ఇండిగో వివాదాన్ని ఆసరాగా తీసుకుని చేస్తున్న ఛార్జీల పెంపుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఇండిగో సర్వీసులు రద్దైన రూట్లలో విమాన టికెట్ ధరలను క్రమబద్ధీకరించింది. నిబంధనలు అతిక్రమించి ఛార్జీలు పెంచితే కఠిన చర్యలు తప్పవని పలు విమానాయాన సంస్థలను హెచ్చరించింది.