NDL: పవిత్ర కార్తీక మాసంలో శివదీక్ష స్వీకరించి, 41 రోజుల మండల దీక్షను పూర్తి చేసి, శ్రీశైలం క్షేత్రంలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి దీక్ష విరమణ చేశారు. జ్యోతిర్ముడి సమర్పించేందుకు ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న ఎమ్మెల్యేకు అధికారులు అర్చక స్వాములు ఆలయ మర్యాదలతో ఆహ్వానం పలికారు. ఎమ్మెల్యే వెంట టీడీపీ ఇంఛార్జ్ వై.యుగంధర్ రెడ్డి తదితరులు ఉన్నారు.