కర్నూలు: డాక్టర్ BR. అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా శనివారం పెద్దకడబూరులోని అంబేడ్కర్ విగ్రహానికి కోసిగి మార్కెట్ యార్డ్ వైస్ ఛైర్మన్ బొగ్గుల తిక్కన్న పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేడ్కర్ బలహీన వర్గంలో జన్మించి అనేక అవమానాలను ఎదుర్కొని ప్రపంచ మేధావిగా నిలిచారని అన్నారు. రాజ్యాంగ నిర్మాతగా, గొప్ప సంఘసంస్కర్తగా సమానత్వ సమాజం కోసం ఆయన నిరంతరం పోరాడారన్నారు.