MDK: డా.బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా హరీష్ రావు ఘన నివాళులు అర్పించారు. దేశ నిర్మాణంలో చేసిన సేవలతో పాటు, ఆర్టికల్ 3 ద్వారా రాష్ట్ర నిర్మాణానికి మార్గం తీయడం విశేషమన్నారు. అణగారిన వర్గాల హక్కుల కోసం ఆయన పోరాటం చిరస్మరణీయమని కొనియాడారు. వారి స్ఫూర్తికి ప్రతీకగా కేసీఆర్ ప్రభుత్వం సచివాలయానికి ఆయన పేరు పెట్టి,125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.