కృష్ణా: ఘంటసాల మండల బీజేపీ అధ్యక్షులు తాళ్లూరి ఫణి హరిప్రసాద్ గృహానికి బ్రహ్మశ్రీ బెనారస్ బాబు వచ్చారు. హరి ప్రసాద్ తండ్రితో ఉన్న పరిచయాల నేపథ్యంలో వీరి గృహానికి వచ్చారు. హరిప్రసాద్ తండ్రి ఇటీవల మరణించారు. దీంతో వీరిని బెనారస్ బాబు పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వీరిని ఘంటసాల మార్కెట్ కమిటీ చైర్మన్ తోట కనకదుర్గ మర్యాదపూర్వకంగా కలిసినారు.