MLG: ఏటూరునాగారం మండలంలోని 11 గ్రామ పంచాయతీలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులు MPDO కార్యాలయానికి చేరుకున్నాయి. ఈ నెల 10న ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలిస్తామని MPDO శ్రీనివాస్ తెలిపారు. మొత్తం 130 పోలింగ్ కేంద్రాలకు 160 బ్యాలెట్ బాక్సులు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే శంకరాజుపల్లి పంచాయతీలో సర్పంచ్, వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యరు.