KDP: ప్రొద్దుటూరులోని అన్న క్యాంటీన్‌ను శనివారం ఉదయం స్థానిక మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి పరిశీలించారు. క్యాంటీన్ లోపల, బయట పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. నాణ్యమైన ఆహారాన్ని ప్రజలకు అందించాలని అక్కడి సిబ్బందిని ఆదేశించారు. రోజుకు మూడు పూటల ఎంతమందికి ఆహారం అందిస్తున్నారని అక్కడి రికార్డులను తనిఖీ చేశారు.