కృష్ణా: ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి దివిసీమ గాంధీ స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు శత జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు అవనిగడ్డ వంతెన సెంటర్లో కృష్ణారావు విగ్రహానికి అవనిగడ్డ అర్చక సంఘం ఆధ్వర్యంలో వఝల వెంకట నాగ సత్య సాయి శర్మ, దీవి సారంగపాణి అయ్యంగార్, ఘంటసాల పవన్ కుమార్ శర్మ, విఖనసాచార్యులు, కూటమి నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు.