GNTR: తెనాలి కొత్తపేటలోని రావి సాంబయ్య మున్సిపల్ హైస్కూల్ 1974-75 బ్యాచ్‌కి చెందిన విద్యార్థులు పాఠశాలకు కుర్చీలను శనివారం బహకరించారు. విద్యార్థులు నేర్చుకున్న స్కూల్‌కు తమ వంతు సాయంగా రూ. 20 వేలు విలువ చేసే 12 కుర్చీలు బహుకరించడం సంతోషంగా ఉందని పూర్వ విద్యార్థులు తెలిపారు. మున్సిపల్ ఛైర్పర్సన్ తాడిబోయిన రాధిక, వైస్ ఛైర్మన్ హరిప్రసాద్ పాల్గొన్నారు.