PLD: సత్తెనపల్లి పట్టణంలోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో శనివారం మహానటి సావిత్రి 90వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సావిత్రి అభిమానులు, కంఠమనేని వెంకట సాంబశివరావు మెమోరియల్ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కళాకారులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రముఖ న్యాయవాది పిన్నమనేని పాములయ్య సావిత్రి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు.