TG: ఇండిగో విమానాల రద్దుతో ఇండియన్ రైల్వే ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. సికింద్రాబాద్-చెన్నై, చర్లపల్లి-కోల్కతాకు దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు సిద్ధం చేసింది. హైదరాబాద్ నుంచి ముంబైకి కూడా రైలు నడిపించనుంది. ఈ ప్రత్యేక రైళ్లలో బెర్తులు ఖాళీగా ఉన్నాయని.. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని రైల్వేశాఖ అధికారులు పేర్కొన్నారు.