VSP: కలెక్టరేట్ మీటింగ్ హాలులో కలెక్టర్ హరేంధిర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్‌తో పాటు ఈఆర్వోలు, ఏఈఆర్వోలతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ప్రత్యేక సమావేశం శనివారం నిర్వహించారు. ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ, మ్యాపింగ్ ప్రక్రియ, బీఎల్వోల శిక్షణ వంటి అంశాలపై సమీక్షించారు. అనంతరం అధికారులకు పలు సూచనలు చేశారు.