SKLM: అవిశ్రాంతంగా శ్రమిస్తున్న హోంగార్డుల సేవలు కీలకం అని ఎస్పీ మహేశ్వర్ రెడ్డి అన్నారు. శనివారం తండేవలస జిల్లా పోలీసు శిక్షణ కేంద్రం మైదానంలో నిర్వహించిన 63వ హోంగార్డు ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా పోలీసు వ్యవస్థలో హోం గార్డులు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు.