ASF: మైనర్ బాలికను అపహరించి అసభ్యంగా ప్రవర్తించిన కేసులో నిందితుడు సాయి చరణ్ రెడ్డికి 35 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.50,000 జరిమానా విధిస్తూ ఆసిఫాబాద్ కోర్టు తీర్పు వెలువరించింది. 2013లో నమోదైన ఈ కేసులో పీపీఈ శ్రీనివాస్, దర్యాప్తు అధికారుల వాదనలు ఆధారంగా శిక్ష ఖరారైంది. బాధితురాలికి న్యాయం జరిగేలా పనిచేసిన అధికారులను ఎస్పీ నితికా పంత్ అభినందించారు.