సత్యసాయి: నల్లచెరువు మండలం పంతులచెరువు గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ పాల్గొని పనులకు శ్రీకారం చుట్టారు. గ్రామ అభివృద్ధిలో పంచాయతీ కార్యాలయం కీలకంగా ఉంటుందని, నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు.