విమాన టికెట్ల ధరలు పెంచకూడదని ఆదేశాలు ఇచ్చినట్లు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. తమ మంత్రిత్వశాఖ పూర్తి దృష్టి ప్రయాణికులపైనే ఉందన్నారు. ప్రత్యేకంగా కమిటీ వేసి విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. ప్రయాణికులకు అత్యవసరంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులను రామ్మోహన్ నాయుడు ఆదేశించారు.