సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో రోజూ లక్షల మంది ఆర్థిక నష్టాన్ని చవిచూస్తున్నారు. అయితే ఈ సమస్యను ఎదుర్కోవడానికి గూగుల్.. ఆండ్రాయిడ్ ఫోన్లలో కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. అదే ‘ఇన్-కాల్ స్కామ్ ప్రొటెక్షన్’. ఈ ఫీచర్ ఆర్థిక లావాదేవీలు చేస్తున్నప్పుడు, అలాగే సేవ్ లేని నంబర్‌తో కాల్ వస్తే స్క్రీన్‌పై హెచ్చరిక చూపిస్తుంది.