ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్గా అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో స్టీవ్ స్మిత్ మూడో స్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్తో జరుగుతున్న యాషెస్ రెండో టెస్టులో స్మిత్ హాఫ్ సెంచరీ చేయడం ద్వారా 4219 పరుగులతో గ్రెగ్ చాపెల్(4209)ను వెనక్కినెట్టాడు. ఈ జాబితాలో దిగ్గజ ఆల్రౌండర్ అలన్ బోర్డర్(6623), పాంటింగ్(6542) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.