విప్లవ పార్టీ నాయకుడు, ఇల్లందు మాజీ MLA గుమ్మడి నర్సయ్య జీవితంపై బయోపిక్ రాబోతుంది. ఇందులో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా శివరాజ్ కుమార్ మాట్లాడుతూ.. మంచి మనిషి జీవిత చరిత్రలో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా, గర్వంగా ఉందన్నారు. తెలుగు నేర్చుకుని ఈ మూవీకి డబ్బింగ్ నేనే స్వయంగా చెబుతానని అన్నారు.