ఆదిలాబాద్లో శనివారం 63వ హోంగార్డ్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎస్పీ అఖిల్ మహాజన్, పోలీసు వ్యవస్థలో హోంగార్డుల సేవలు అభినందనీయమని తెలిపారు. హోంగార్డుల గౌరవ వందనం స్వీకరించి, పలువురు హోంగార్డులకు ప్రశంస పత్రాలు అందజేశారు. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎస్పీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఇంద్రవర్ధన, ఆర్ఐలు కూడా పాల్గొన్నారు.