AP: అల్లూరి జిల్లా అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. గిరిజనులకు జీవనోపాధి మార్గాలు పెంచాలని అధికారులను ఆదేశించారు. పకడ్బందీగా ప్రణాళికను అమలు చేయాలన్నారు. గిరిజన ఉత్పత్తుల పెంపు, మార్కెటింగ్ అవసరమని అన్నారు. ఎకో టూరిజంపై అవగాహన కల్పిస్తే ఆదాయం వృద్ధి చెందుతుందని.. సినిమాలు, సీరియళ్ల షూటింగ్లు జరిగేలా ప్రోత్సహించాలని సూచించారు.