AKP: అట్టడుగు వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ ఎంతో కృషి చేశారని ఎస్ రాయవరం ఎంపీపీ వెంకటలక్ష్మి, జడ్పీటీసీ దేవి అన్నారు. శనివారం అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి టీడీపీ అధ్యక్షుడు అమలకంటి అబద్ధం, మాజీ సర్పంచ్ వెంకటేశ్వరరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని కోరారు.