కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో అంబేడ్కర్ చౌరస్తాలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ… డాక్టర్ బీ.ఆర్. అంబేడ్కర్ సామాజిక అసమానతల నిర్ములనకు తన జీవితాన్ని అంకితం చేసిన యోధుడు రాజ్యాంగ పితామహుడు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏబివిపి నాయకులు విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు.