E.G: పాఠశాల అభివృద్ధికి తన వంతు నిరంతరం కృషి చేస్తానని స్ఫూర్తి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు, రాష్ట్ర వోబీసీ మోర్చా ఉపాధ్యక్షుడు కురగంటి సతీష్ అన్నారు. శనివారం రాజమండ్రిలోని 25వ డివిజన్లోని నగర పాలక ప్రాధమిక పాఠశాలకు స్ఫూర్తి ఫౌండేషన్ ద్వారా రూ.17 వేలు విలువైన ప్రింటర్, నోటు పుస్తకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో యానాపు ఏసు పాల్గొన్నారు.