ATP: రాష్ట్రంలో రైతాంగాన్ని ఆదుకునే విషయంలో కేంద్రంతో పోరాల్సిన చంద్రబాబు ఇక్కడి ప్రజలు, రైతులను పణంగా పెట్టి తన పాత కేసులను మాఫీ చేసుకుంటున్నరని వైసీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. శనివారం వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఉందంటే అది ఇక్కడి ఎంపీల వల్లే అని గుర్తు చేశారు.