ATP: రాష్ట్ర వైసీపీ జాయింట్ సెక్రటరీగా నియమితులైన పేరం స్వర్ణలత, పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి, మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తాడిపత్రి వైసీపీ కార్యాలయంలో శనివారం ఆమె పెద్దారెడ్డికి పుష్పగుచ్ఛం అందజేసి ధన్యవాదాలు తెలియజేశారు. తనపై ఉంచిన నమ్మకానికి అనుగుణంగా నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.