ప్రకాశం: కంభం మండలం ఎర్రబాలెంలో గిద్దలూరు MLA ముత్తుముల అశోక్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఎర్రబాలెం గ్రామం నుంచి బస్టాండ్ వరకు తారు రోడ్డు వేశారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో అధికారుల దృష్టికి సమస్యను గ్రామస్తులు తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ప్రజలు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు.