ASF: కాగజ్ నగర్ మండలంలో భట్పల్లి గ్రామానికి చెందిన పిప్పిరి విజయ్ కృష్ణ కుమారుడు చక్రవర్తికి చికిత్స కోసమై CMRF ద్వారా మంజూరైన రూ.7 లక్షల LOC ని MLA హరీష్ బాబు శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. CMRF అనేది నిరుపేదలకు వరం లాంటిదని తెలిపారు.