WGL: పర్వతగిరి మండలం చింత నెక్కొండ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా రిటైర్డ్ HM గటిక మల్లయ్య (80) గ్రామాన్ని బాగుచేయాలనే ఉద్దేశంతో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలో చేపట్టిన సేవా కార్యక్రమాలను గుర్తు చేస్తూ.. గడపగడప తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. దీంతో గ్రామస్థులు ఆయన అనుభవానికి మద్దతిస్తూ ఆదరిస్తున్నారు.