WGL: చెన్నారావుపేట మండలం లింగాపురం గ్రామంలో ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు ఓరుగంటి రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. సమాజంలో సమానత్వం, విద్య, న్యాయం కోసం అంబేద్కర్ చూపిన మార్గంలో నడవాలని రమేష్ పిలుపునిచ్చారు.