MBNR: జడ్చర్ల మండల పరిధిలోని కోడగల్ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. దీంతో పాఠశాలలో విద్యార్థులతో చేయించిన వెట్టి చాకిరి పనులకు సంబంధించిన వీడియోలు బయటపడ్డాయి. పిల్లలతో తరగతి గదులను శుభ్రం చేయించడం, కారుని వాషింగ్ చేయడం, ప్లంబింగ్ పనులు చేయడం వంటి పనులు చేయించినట్లు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.