జనగామ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్థంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. సమాజంలో సమానత్వం,హక్కుల కోసం అంబేద్కర్ చేసిన పోరాటం స్పూర్తిదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.