ELR: అంబేద్కర్ వర్ధంతి సందర్బంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం బస్టాండ్ ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి పూలదండలు వేసి శనివారం నివాళులర్పించారు. చింతలపూడి నియోజకవర్గం ఇన్ఛార్జ్ మేకా ఈశ్వరయ్య మాట్లాడుతూ.. భారతదేశంలో ప్రజాస్వామ్యం, సమానత్వం, సామజిక న్యాయం అనేవి రాజ్యాంగం యొక్క గొప్ప తనం అన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.