SDPT: గ్రామ పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలని ఎంపీడీవో కడవెర్గు ప్రవీణ్ సూచించారు. మండల పరిషత్ కార్యాలయంలో డిసెంబర్ 9, 10 తేదీలలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే సదుపాయం ఉంటుందని తెలిపారు. ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు విధిగా ఐడీ కార్డు, ఎన్నికల ఆర్డర్ కాపీతో రావాలని ఆయన కోరారు.