హన్మకొండ కలెక్టరేట్ ఎదుట ఊరుగొండ గ్రామ రైతులు అదనపు కలెక్టర్ వెంకట్ వెంకట్ రెడ్డిపై శనివారం నిరసన తెలిపారు. గ్రీన్ ఫీల్డ్ హైవే భూసేకరణలో అన్యాయం చేశారని, మార్కెట్ ధర చెల్లించకుండా తమను ఇబ్బందులకు గురి చేసారని ఆరోపించారు. ఏసీబీ కేసులో చిక్కిన ఆయన ఆస్తులను జప్తు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా టపాసులు కాల్చి, స్వీట్లు పంచుకున్నారు.