ప్రకాశం: కనిగిరి కేటీఆర్ టెక్నో స్కూల్ ప్రాంగణంలో వేంచేసియున్న లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం నరసింహ స్వామి వారికి పల్లకి సేవాకార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దేవస్థాన అర్చకులు చోడా వీరభద్రస్వామి పూజలు నిర్వహించి భక్తులుకు తీర్థప్రసాదాలు అందజేశారు.