HNK: ఎల్కతుర్తి మండలంలోని RTC బస్టాండ్ వద్ద శనివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. RTC బస్సు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ఆటోను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో భీమదేవరపల్లి మండలం మల్లారం గ్రామానికి సంపత్ కుమారుడికి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.