ADB: జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్లో తెలంగాణ మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో డా. బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. జిల్లా అధ్యక్షుడు మనోజ్ కుమార్ మాట్లాడుతూ.. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు అందుతున్నాయన్నారు.