VKB: భారత రాజ్యాంగ రచయిత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని ఇవాళ వికారాబాద్ ఎన్నేపల్లి చౌరస్తా వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శివరాజ్ మాధవరెడ్డి, పట్టణ అధ్యక్షురాలు శిరీష పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాయకులు వివేకానంద రెడ్డి, సుచరిత, నరోతం రెడ్డి పాల్గొన్నారు.