GDWL: అంబేడ్కర్ సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి కొనియాడారు. శనివారం అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా గద్వాలలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన చూపిన మార్గంలో ప్రతీఒక్కరు నడుచుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానికులు పాల్గోన్నారు.