BHPL: జిల్లా వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల సమయంలో బెల్టు షాపుల ద్వారా మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. DEC 1 నుంచి కొత్త మద్యం పాలసీ అమలవుతున్నప్పటికీ అధికారులు బెల్టు షాపులను అదుపు చేయడంలో విఫలమవుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. గుడుంబా కేంద్రాలపై కఠినంగా వ్యవహరిస్తున్న ఆబ్కారీ శాఖ బెల్టు షాపులను పట్టించుకోవడం లేదనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.