AP: కరెంట్ షాక్ తగిలి కొట్టుమిట్టాడుతున్న తల్లిని 5వ తరగతి బాలుడు దీక్షిత్ తన సమయస్ఫూర్తితో కాపాడాడు. ప.గో జిల్లా జొన్నలగరువుకు చెందిన దీక్షిత్.. నిన్న స్కూల్ PTMకు తల్లి రాకపోవడంతో ఇంటికి వెళ్లిచూశాడు. కరెంట్ షాక్ తగిలిందని గమనించి తల్లిని కాపాడేందుకు వెంటనే మోటార్ స్విచ్ ఆఫ్ చేశాడు. అనంతరం తల్లిని స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించాడు. అనంతరం PTMకు వెళ్లాడు.