KDP: మన ఊరి కోసం స్వచ్ఛంద సేవా సంస్థ మానవత్వం చాటుకుంది. సిద్ధవటం మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన టీడీపీ నేత పొట్టా శివ ఇటీవల అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శనివారం మాధవరం -1 గ్రామానికి చెందిన మన ఊరి కోసం సేవా సంస్థ సభ్యులు శివ కుటుంబానికి రూ.45 వేలు డబ్బులు రూ.7 వేలు విలువగల నిత్యావసర సరుకులు అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు.