VKB: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్ శాసనసభ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన రచించిన రాజ్యాంగం ద్వారానే దేశంలో పాలన సాగుతూ, అందరికీ సమాన ఫలాలు అందుతున్నాయని ఈ సందర్భంగా స్పీకర్ తెలిపారు.