CTR: రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ తెలిపారు. పెట్టుబడుల సాధన కోసం అమెరికా, కెనడా దేశాలలో పర్యటించనున్న మంత్రి నారా లోకేష్‌కు స్వాగతం పలికేందుకు డల్లాస్ విమానాశ్రయానికి నగరి ఎమ్మెల్యే చేరుకున్నారు. ఐదు రోజులపాటు మంత్రి పర్యటన ఉంటుందని ఆయన వెల్లడించారు.